SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:45 pm Posted by : SALAM PRODDATUR

రాజ్యాంగ విలువల పరిరక్షణే ప్రతి ఒక్కరి బాధ్యత – ఎంపీపీ కొప్పోలు భారతీ

 

 

సలాం   ప్రొద్దుటూరు:

 

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) కొప్పోలు భారతీ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కొప్పోలు భారతీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలు ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు.రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తించాలని, రాజ్యాంగ విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి, మార్తల లక్ష్మిరెడ్డి, మార్తల ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.